పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈ స్థాయిలో వున్నాం : ఆకాశ్

Tuesday, May 8th, 2018, 05:05:08 PM IST

సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు మెహబూబా సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మొదటి సారి పూరి నుంచి వచ్చిన డిఫెరెంట్ సినిమా కావడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ టీజర్స్ అలాగే సాంగ్స్ ఇప్పటికే ఆకట్టుకోగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ఇంకాస్త పెంచింది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాన్నని నమ్మి మొదటికి అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆయనే. బద్రి సినిమా ఆయన చేయకుంటే అంత పెద్ద హిట్ అయ్యుండేది కాదేమో.. ఆయన చేసినందుకే అంతగా క్రేజ్ ఏర్పడింది. అందుకే పవర్ స్టార్ అంటే చాలా ఇష్టమని ఆకాష్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక సినిమా చేస్తే ఏ స్టార్ హీరోతో కలిసి చేస్తావు అనే విషయంపై సమాధానం ఇస్తూ.. స్టార్ హీరోగా ఎదగడానికి వాళ్లు ఎంతో కష్టపడ్డారు. ముందు వారి స్థాయికి నేను రావాలి అంటే స్టార్ హీరో అర్హతను కొంతైనా సంపాదించుకోవాలని ఆకాష్ తెలిపాడు.