పూరీ మాఫియాను వదిలేలా లేడే..!

Monday, February 11th, 2019, 04:30:16 PM IST

టాలీవుడ్ మాఫియా బేస్డ్ సినిమాలకు పెట్టింది పేరు పూరీ జగన్నాధ్, గతంలో పూరీ దర్శకత్వంలో మాఫియా నేపథ్యంలో వచ్చిన సినిమాలు శివమణి, పోకిరి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే పూరీ వరుస పెట్టి మాఫియా కథలను నమ్ముకోవటంతో ఆయన సినిమాల్లో కొత్తదనం కొరవడుతూ వచ్చింది, ఆయన సినిమాలు ఆడియెన్స్ కు సైతం బోర్ అనిపించటం మొదలైంది. దీంతో ఇక తన పంధా మార్చుకోవాలని డిసైడ్ అయిన పూరి తన కొడుకు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా అనే ఇండో – పాక్ జంట మధ్య సాగే లవ్ స్టోరీతో వచ్చాడు, ఆ సినిమాను పూరీ బాగా ప్రమోట్ చేసినప్పటికీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు.

తాజాగా ఆకాష్ పూరీ హీరోగా మరో సినిమా అనౌన్స్ చేసాడు పూరీ, ఆకాష్ బర్తడే సందర్బంగా సినిమా టైటిల్ ను లాంచ్ చేసింది సినిమా యూనిట్. “రొమాంటిక్” అన్న టైటిల్ తో రానున్న ఈ సినిమాకు స్వయంగా పూరీయే స్క్రిప్ట్ అందిస్తున్నాడు, పూరీ కంటెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కొత్త డైరెక్టర్ అనీల్ పాదూరిని పరిచయం చేస్తున్నాడు పూరీ. ఆకాష్ సరసన గాయత్రీ భరద్వాజ్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవ్వనుంది, ఈ సినిమా కథ మాఫియా ప్రధానంగా సాగనుందని వార్తలొస్తున్నాయి. మరీ, ఈ సారైనా పూరీ తన కొడుక్కి హిట్ సినిమా ఇస్తాడో లేదో చూడాలి.