మేమెందుకు సీఎం కాలేం? ఓవైసీ ఎటాక్!

Saturday, September 8th, 2018, 02:55:55 AM IST

సీఎం కేసీఆర్‌పైనా, రాబోవు ఎన్నిక‌ల వేళ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. అసెంబ్లీని ర‌ద్దు చేసిన సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు అంటూ చేస్తున్న హ‌డావుడికి త‌న‌దైన శైలిలో ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు తేరాస‌కు ఎంఐఎం మిత్ర‌ప‌క్ష‌మేన‌ని అంతా భావిస్తారు. కానీ ఓవైసీ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఒక శ‌త్రువులా ఎటాక్ ఇచ్చారే! అన్నంత‌గా ఆయ‌న సీఎం తీరుపై ఫైరైపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ముంద‌స్తు వేళ త‌మ‌ని ఎక్క‌డ విస్మ‌రిస్తారోన‌ని బెంగ పెట్టుకున్న‌వాడిలా ఓవైసీ వాయిస్ వినిపించింది. కర్ణాటకలో జేడీఎస్‌కు కింగ్‌మేకర్‌ స్థాయి నుంచి కింగ్‌గా మారే అవకాశం వచ్చిందని ఈ సంద‌ర్భంగా ఓవైసీ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ గుర్తు చేశారు. తెలంగాణలో తమకూ ఆ ఛాన్స్ రావొచ్చునని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినప్పుడు.. తెలంగాణలో ఎంఐఎం అభ్యర్థి ఎందుకు సీఎం కాలేర‌ని కాస్త క‌టువుగానే వ్యాఖ్యానించారు. “నవంబర్‌లో ఎన్నికలు వస్తాయి.. డిసెంబర్‌లో ముఖ్యమంత్రినవుతా“నంటూ కేసీఆర్‌ అంటున్నారు. డిసెంబర్‌లో ఎవరి అవసరం ఎవరికొస్తుందో చూద్దాం! అని స‌వాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా జెండా ఎగరేస్తాం.. సత్తా చూపిస్తామని ఓవైసీ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments