అఖిల్ సేఫ్.. ఫ్యాన్స్ హ్యాపీ?

Monday, June 4th, 2018, 09:57:26 PM IST


నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా టాక్ ను తెచ్చుకుంది. కనీసం కలెక్షన్స్ కూడా ఓ మోస్తరుగా రాకపోవడం అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు వర్మ అఖిల్ తో ఒక సినిమా తప్పకుండా చేస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే నాగ్ కూడా ప్రెస్ మీట్ లో ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి అని త్వరలోనే ఉండవచ్చని చెప్పాడు.

ఇక ఆఫీసర్ రిజల్ట్ తరువాత పరిస్థితి మారిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆర్జీవీ చేతిలో అఖిల్ ను పెట్టేందుకు అక్కినేని ఫ్యామిలీ నో చెప్పిందని టాక్. ప్రస్తుతం అఖిల్ మంచి బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆఫీసర్ తరహాలో డిజాస్టర్ అందితే కెరీర్ కు దెబ్బపడుతుందనిక్ రిస్క్ వద్దని నాగ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments