చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్.. అఖిల‌ప్రియ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

Friday, January 11th, 2019, 01:48:06 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, మంత్రి భూమా అఖిల‌ప్రియ దూర‌మవుతున్నార‌నే వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.వైసీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత వైసీపీ నుండి ఎమ్మెల్యే అయిన అఖిల‌ప్రియ, ఆ త‌ర్వాత టీడీపీలో చేరి మంత్రి అయిన సంగ‌తి తెలిసిందే. అయితే జిల్లాలో టీడీపీ నేత‌ల‌కి అఖిల‌ప్రియ‌కి మ‌ధ్య వార్ న‌డుస్తోంది. దీంతో అఖిల ప్రియ పంచాయితీ ఏంకంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు టీడీపీ నేత‌లు ఆమెకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది.

దీంతో తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన అఖిల‌ప్రియ‌, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కర్నూల్ వచ్చి సభ పెడితే ఆ సభకు కూడా రాలేదు అఖిలప్రియ. అయితే ప్రభుత్వ పెద్దలు పార్టీ వర్గాలు కూడా ఆమెతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యకపోవడం గమనార్హం. ఇక మ‌రోవైపు చంద్ర‌బాబు జ‌రిపిన ఇన్న‌ర్ స‌ర్వేలో అఖిలిప్రియ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని స‌మాచారం. దీంతో చంద్ర‌బాబు తెలివిగా ముందుగానే భూమా కుటుంబంలో ఒక‌రికే టిక్కెట్ ఇస్తాన‌ని చెప్పార‌ని తెలుస్తోంది. దీంతో అఖిల‌ప్రియ‌కు టిక్కెట్ క‌ష్టమే అని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా షాక్ తిన్న అఖిల‌ప్రియ పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. దీంతో త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ఆమె జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశ‌లు ఉన్నాయ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే భూమా కుటుంబానికి, మెగా కుంటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. గ‌తంలో శోభానాగిరెడ్డి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున పోటీ చేసి నెగ్గారు. దీంతో గ‌తంలో ఉన్న ప‌రిచ‌యాల‌తో ఇప్ప‌టికే జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో అఖిల‌ప్రియ ట‌చ్‌లో ఉన్నార‌ని, సంక్రాంతి తరువాత జ‌రుగ‌నున్న‌ ఏపీ క్యాబినెట్ సమావేశానికి గనుక ఆమె హాజరు కాకపోతే పార్టీని వీడడం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.