చీపురు పట్టిన అక్కినేని ఫ్యామిలి

Sunday, October 26th, 2014, 05:10:13 PM IST

nagarjuna-1
అక్కినేని నాగార్జున ఫామిలి మెంబర్ ఈ రోజు స్వచ్చభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ ఉదయం అక్కినేని నాగార్జున, అమల, నాగసుశీల, చైతన్య, అఖిల్, సుశాంత్ మరియు చాముండేశ్వరీ నాథ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున స్వచ్చభారత్ కోసం నాగార్జున ఫర్ స్వచ్చభారత్ అనే పేరుతో వెబ్ సైట్ ను కూడా లాంచ్ చేశారు. స్వచ్చభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నాగార్జున.. నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

స్వచ్చ భారత్ లో పాల్గొనాలని.. అడాగ్ అధినేత అనిల్ అంబాని టాలివుడ్ మన్మధుడు నాగార్జునను.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి