వర్మకు అక్కినేని అభిమానుల పాలాబిషేకం

Tuesday, June 5th, 2018, 03:53:42 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమా మొత్తానికి డిజాస్టర్ అని తేలింది. చిత్ర సహా నిర్మాతే సినిమా ఏ విధంగా హిట్ అవ్వలేదని కలెక్షన్స్ పరంగా కూడా భారీ దెబ్బ కొట్టిందని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అక్కినేని అభిమానులు అయితే వర్మ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. తప్పకుండా సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పిన చిత్ర యూనిట్ మాటలు మొత్తం అవాస్తవమని తేలింది.

ఇక వర్మ దర్శకత్వ ప్రతిభకు అక్కినేని అభిమానులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. వర్మ కౌటౌట్ కి పాలాభిషేకం చేస్తూ ఆశ్చర్యపరిచారు. అయితే అలా చేయడానికి ఒక కారణం ఉంది. నెక్స్ట్ అఖిల్ తో వర్మ ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోవడం లేదు. మళ్లీ అక్కినేని హీరోలతో సినిమాలు చేయకండని సవినీయంగా వేడుకుంటున్నట్లు పాలాబిషేశం చేస్తూ వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఆ ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి సైలెంట్ గా ఉన్న వర్మ ఈ ఫొటోపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments