చికిత్స పొందుతున్న అక్కినేని

Sunday, October 20th, 2013, 01:15:12 PM IST

తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏఎన్ఆర్ కు కేన్సర్ సోకినట్లు వైద్యులు గుర్తించగా తాజాగా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.

తన దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని ఇటీవలే వైద్యులు తెలిపారని అక్కినేని మీడియా ముందు వెల్లడించారు. వృద్దాప్యంలో ఈ క్యాన్సర్ కణాలు నెమ్మదిగా పని చేస్తాయని వైద్యులు తెలిపారన్నారు. అక్టోబర్ 8న తనకు కడుపునొప్పి వచ్చిందని దాంతో, కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని తెలిపారు. మనోబలం, అభిమానుల ఆశీర్వచనాల వల్లే ఆరోగ్యాన్ని అధిగమించానని.. మనోబలానికి మించి ఇన్నాళ్లు అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో పనిచేస్తున్నానన్నారు. ప్రజల అభిమానం, ఆశీర్వచనాలు ఉంటే సెంచరీ కొడతానన్నారు.