కిలాడీ అక్కీ ఫైర్‌! మీడియా వ్య‌క్తిపై పోలీస్ కేసు!!

Monday, October 8th, 2018, 02:51:11 PM IST

త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగిస్తూ మార్ఫింగ్ వీడియోని లైవ్ చేశాడ‌ని ఆరోపించాడు కిలాడీ అక్ష‌య్ కుమార్. ఆ మేర‌కు ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇంత‌కీ ఏమైంది? అంటే..

గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ క‌థానాయిక త‌నూశ్రీ ద‌త్తా వ్య‌వ‌హారంలో ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ని దారుణంగా హింసించాడ‌ని కంగ‌న ఆరోపించింది. ఆ క్ర‌మంలోనే త‌న‌కు మ‌ద్ధ‌తు పెరిగింది. తాజాగా ఈ వివాదంలోకి అక్ష‌య్‌ని లాగే ప్ర‌య‌త్నం జరిగింది. కిలాడీ అక్ష‌య్ కుమార్ ఇచ్చిన ఓ వీడియో ఇంట‌ర్వ్యూలో త‌నూశ్రీ పేరును మార్ఫ్ చేస్తూ ఓ వీడియోని లైవ్ చేశారు. దీంతో ఆ యూట్యూబ్ వీడియోని వీక్షించిన అక్ష‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న మ‌ర్యాద‌కు భంగం వాటిల్లింద‌ని ఆరోపించ‌డంతో పోలీసులు సీరియ‌స్‌గా ఇన్వెస్టిగేష‌న్ సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ వెబ్ లింక్ యూట్యూబ్ నుంచి మాయ‌మైంది. స‌ద‌రు వ్య‌క్తిపై ఐటీ-నేరం చ‌ట్టం కింద తీవ్రంగా శిక్షించ‌నున్నారని తెలుస్తోంది. ఆ వీడియోలో అక్కీని నెగెటివైజ్ చేస్తూ త‌నూశ్రీ పేరును మార్ఫ్ చేసి, ఎడిట్ చేయ‌డం స్ప‌ష్టంగా ఉంద‌ని వెల్ల‌డైంది. అక్ష‌య్ కుమార్ కెరీర్ ఆరంభం క‌థానాయిక‌ల‌తో ఎఫైర్లు సాగించేవాడ‌న్న ప్ర‌చారం ఉన్నా.. ఇటీవ‌లి కాలంలో జెంటిల్‌మేన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా వివాదంతో మ‌రోసారి అత‌డి పేరు జ‌నాల్లోకి వ‌చ్చిన‌ట్ట‌య్యింది.