అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం.. 257 మంది మృత్యువాత!

Thursday, April 12th, 2018, 11:16:43 AM IST

అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. 257 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆ దేశంలో వందలాది కుటుంబలో విషాదాన్ని నింపింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు సమీపంలో బౌఫారిక్‌ వైమానిక స్థావరం వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడి నుంచి నుంచి టేకాఫ్‌ అయిన విమానం దగ్గరలో ఉన్న పంటపొలాల్లో ఒక్కసారిగా కూలిపోయింది. విమానంలో దేశ సైనికులు అలాగే వారి కుటుంబాలు ఉన్నాయి.

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారిని తరలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. 247 సైనికులు వారి కుటుంబాలు మరో 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. 120 కంటే ఎక్కువ మందిని విమానంలో తీసుకెళ్లడం వల్ల ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. గతంలో కూడా అల్జీరియాలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ప్రతి సరి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేశ సైనికుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అక్కడి మీడియా అల్జీరియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దీంతో అల్జీరియా రక్షణ శాఖ మంత్రి ఘటనపై విచారణకు ఆదేశించారు.

  •  
  •  
  •  
  •  

Comments