అంబానీ పెళ్లిలో చిన్న‌కోడ‌లుపైనే క‌ళ్ల‌న్నీ!

Monday, March 11th, 2019, 12:21:02 AM IST

అంబానీల ఇంట పెళ్లి వేడుక గురించే ప్ర‌పంచం మొత్తం ముచ్చ‌టించుకుంటోంది. ముంబై కుర్లా కాంప్లెక్స్ సెంట‌ర్ లోని వ‌ర‌ల్డ్ జియో సెంట‌ర్ ఈ వివాహానికి వేదిక అయ్యింది. ఈ వివాహ వేదిక సెల‌బ్రిటీల సంద‌డితో త‌ళుకులీనింది. ఆకాష్ అంబానీ- శ్లోకా మెహ‌తా పెళ్లి ఈ ఆదివారం నాడు ఘ‌నంగా జ‌రిగింది. బాలీవుడ్ నుంచి ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు ఈ ఈవెంట్ కి ఎటెండ్ అయ్యారు. వీళ్ల‌లో షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చ‌న్, అభిషేక్ బ‌చ్చన్ త‌దిత‌రులు కుటుంబ స‌మేతంగా ఈ ఈవెంట్ కి ఎటెండ్ అయ్యారు. న‌వ‌త‌రంలో టైగ‌ర్ ష్రాఫ్ – దిశా ప‌టానీ జంట ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. అలాగే ఆల‌యా భ‌ట్ ఎల్లో డ్రెస్ లో కొత్త లుక్ తో మైమ‌రిపించింది.

ఇక ఈ పెళ్లి ఆద్యంతం మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గురించి సెల‌బ్రిటీలు ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. ఇదే పెళ్లి వేడుక‌లో అంబానీల చిన్న కోడ‌లు రాధిక త‌ళుకుబెళుకుల గురించి ముచ్చ‌ట సాగింది. పెద్ద కొడుకు పెళ్లిలో చిన్న కోడ‌లు సంద‌డి అంటూ ఒక‌టే ముచ్చ‌ట్లు పెట్టారంతా. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్యామ‌ణి అంటూ అంద‌రి క‌ళ్లు ప‌డ్డాయి. కాబోయే అత్త‌మామ‌లతో .. ఆయ‌న‌తో వేదిక‌ ఆద్యంతం రాధిక సంద‌డి క‌నిపించింది. అనంత్ – రాధిక జంట ప్రేమాయ‌ణం గురించి చ‌ర్చ సాగింది. తొంద‌ర్లోనే ఈ జంట‌కు కూడా పెళ్లి చేసేస్తారన్న ముచ్చ‌టా సాగింది. ఇక రాధిక ఈ వేదిక వ‌ద్ద‌ ఆరెంజ్ క‌ల‌ర్ లెహంగాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ పెళ్లి వేడుక‌లో సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు స‌హా పారిశ్రామిక వేత్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.