కేంద్ర మంత్రులంతా రేపు ఢిల్లీలోనే..మరో సంచలనం కోసమేనా..?

Friday, December 30th, 2016, 10:32:01 PM IST

modi
ప్రధాని మోడీ మంత్రులందరికీ హై అలెర్ట్ లాంటి ఆదేశాలను జారీ చేశారు. రేపు కేంద్ర మంత్రి వర్గం మొత్తం ఢిల్లీలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో రేపు ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఊహాగానాలు మొదలవుతున్నాయి. పాత కరెన్సీ డిపాజిట్ చేసుకోవడానికి నేటితో గడువు ముగియడంతో రేపు ప్రధాని మరో సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.డిసెంబర్ 31 న ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

మరోవైపు రేపు ప్రధాని ప్రసంగం లో అనేక సంచలన ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు. దీనికోసం మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల పై వరాల జల్లులు ఏమైనా కురిపిస్తారా అనే దిశగా కూడా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే మోడీ రైతుల కోసం రుణ మాఫీ ప్రకటనని చేసే అవకాశం ఉందని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments