కంచె ఐలయ్యపై ఘాటుగా ఉన్న… రాజకీయ లబ్ది అడ్డొస్తుంది!

Friday, September 29th, 2017, 08:15:05 AM IST


కంచె ఐలయ్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయిన పేరు. ఒక కులాన్ని, మతాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఇతనికి మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ అలవాటు ఎంతలా అంటే, అతని భావజాలం ఇతరుల మీద రుద్దేందుకు పుస్తకాలు సైతం రాస్తాడు. ఎప్పుడో గతించిపోయిన కుల వివక్షని పైకి తీసుకొచ్చి చూపిస్తాడు. హిందూ మతం గ్రంధాలలో కుల వివక్ష ఈ స్థాయిలో ఉంది. అగ్ర వర్ణాల ఆధిపత్యం ఉండేది. నిమ్న వర్గాలని ఎదగకుండా చేసేసారు. అంటూ అప్పటి వివక్ష మరో మరో సారి ఇప్పుడు జనాలకి అంటగట్టి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ గా అతను విద్యార్ధులకి ఎం పాఠాలు చెబుతున్నాడో తెలియదు గాని, ఇలా తన పుస్తకాలతో వర్ణ విభేదాలు ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటాడు. మీడియా చానల్స్ ఈ షో కాల్డ్ మేధావిని తీసుకొచ్చి అతని భావజాలం మరింతగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ప్రజలకి ఇప్పటికే అర్ధమైంది.

అయితే తాజాగా సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అంటూ ఒక కులాన్ని కించ పరుస్తూ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం మీద వైశ్యులు ఎదురుదాడి చేసి, పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసారు. కంచె ఐలయ్యతో గొడవకి దిగారు, బెదిరించారు, భయపెట్టారు. అయితే అతను మాత్రం తన భావజాలం సమాజం మీద రుద్దడంలో ఎలాంటి తప్పు లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ పుస్తకం మీద గొడవ రాజకీయ నాయకుల వరకు వెళ్ళింది. పోలీసుల వరకు వెళ్ళింది. ఏపీలో చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దీజీపే సాంబశివరావు సీరియస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీటింగ్ లో చంద్రబాబు ఆ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఒక కులాన్ని కించపరిచే విధంగా పుస్తకాలు రాయడం సరైన పద్ధతి కాదు, అతని పద్ధతిని తాను తీవ్రంగా ఖండిస్తున్న అని చెప్పారు. అంతకంటే ముందుగానే తెలంగాణలో ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావు, తాజాగా కేటీఆర్ కూడా స్పందించారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వాఖ్యలు చేయడం, పుస్తకాలు రాయడం అనేదానికి తాము పూర్తి వ్యతిరేకం అని, కులాల మధ్య విభేదాలని పెంచే ఇలాంటి పుస్తకాలని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

అయితే అసలు రాజకీయ ఇక్కడే ఉంది. మొత్తం ఒక సామాజిక వర్గం మీద విమర్శలు చేస్తూ, వారి మనోభావాలని కించపరిచే విధంగా ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు నిషేధించాలేకపోతున్నాయి అనే విషయం ఆలోచిస్తే, కంచే ఐలయ్య ఆరోపణలు చేసిన వైశ్య వర్గం ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వారికి సపోర్ట్ చేస్తూ పుస్తకంపై నిషేధం కంచె ఐలయ్యని ప్రతినిధిగా భావిస్తున్న బీసీలో దిగువ స్థాయి కులాలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుని పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఆ కులాల ఆధిక్యం తెలంగాణలో చాలా ఎక్కువ, పుస్తకంపై నిషేధం విధిస్తే వారి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇక ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఇంచు, మించు అదే, ఓటు బ్యాంకు కావాలంటే కంచె ఐలయ్య పుస్తకం మీద గాని, ఆయన అరెస్ట్ విషయంలో కాని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కంచె ఐలయ్య పుస్తకం మీద, ఆయన వాఖ్యాల మీద గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కేవలం ఎప్పుడు చెప్పే మాటల ప్రకారం ఖండిస్తున్నాం అనే మాట ఉపయోగించి వైశ్యులని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు శాంతించకపోయిన జరిగే నష్టం అయితే రాజకీయ పార్టీలకి లేదు. అందుకే కంచె ఐలయ్య మీద ఎలాంటి చర్యలు లేవు అనేది విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments