ఏ పార్టీ ఎవరితో.? ఉత్కంఠకు తెర లేపుతున్న తెలంగాణా రాజకీయ పొత్తులు..!

Monday, September 10th, 2018, 01:18:07 PM IST

తెలంగాణా రాజకీయం లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన షాక్ కి ఇతర రాజకీయ పార్టీలు ఒక్కక్కళ్లు తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలు అని ప్రకటించడంతో ప్రతి ఒక్క పార్టీ లో అలజడి మొదలయ్యింది, అదే సమయంలో ఏ పార్టీకి వారు వారి వ్యూహాలను నిర్మిచుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి తెలంగాణా లో ప్రతి ఒక్క పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం తెరాస పార్టీ గానే కనపడుతుంది. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే తెరాస ప్రభుత్వాన్ని మాత్రం గద్దె దించాలని ప్రతి ఒక్క పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే దీనికి అనుగుణంగా తెరాస ప్రభుత్వాన్ని దించడానికి అక్కడి పార్టీల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తున్న ఏకైక దారి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారికి అంత సమయం మిగల్చలేదు కెసిఆర్. అందుకని వారు ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు తెలుస్తున్నది. ఐతే తెలంగాణాలో పొత్తులు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా ఆసక్తికర అంశాలు, వ్యూహాలలో వారు నిమగ్నం అయ్యి ఉన్నట్టు తెలుస్తున్నది. తెరాస ప్రభుతాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్న అక్కడి పార్టీలు ఒక పార్టీ తో మరో పార్టీ పొత్తు పెట్టుకోకుండా సరికొత్త పద్ధతిలో అన్ని ముఖ్య పార్టీలు ఏకీకృతమై ఒక “మహా కూటమి” గా మారి ఎన్నికలలో దిగుతున్నాం అన్నట్లు చాడ వెంకటరెడ్డి మరియు రమణలు తెలిపారు. సీట్లు మరియు టికెట్ల కోసం ప్రాకులాడకుండా కేవలం గెలుపు వైపు మాత్రమే ముందుకు సాగిపోవాలి అని తెలిపారు.

అయితే తెలంగాణా లో ఏ పార్టీ వారు ఏ పార్టీ తో కలిసి నడిచి తెరాస ని గద్దె దించుతారో అన్న అంశం కూడా చర్చనీయాంశం అయ్యింది. సమాచారం ప్రకారం కాంగ్రెస్ మరియు బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ కలవవు. అటు చంద్రబాబు కూడా బీజేపీ తో కలిసి వెళ్లే అవకాశం కూడా లేదు అందుకని తెలంగాణా లో వామ పక్షాలు అయినటువంటి సిపిఐ మరియు తేజస తో కలిసి వెళ్లనున్నట్టుగా సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ తో కూడా టీడీపీ సిపిఐ కలిసి వెళ్లొచ్చు అనే ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా సారి తెలంగాణా రాష్ట్రం లో తెరాస ప్రభుత్వాన్ని ఎలా ఐనా గద్దె దింపాలి అని అన్ని పార్టీలు వారు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సారి వచ్చే ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని తెరాస నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments