ఆ వార్తలన్నీ అవాస్తవం : మాజీ జెడి లక్ష్మి నారాయణ

Monday, April 23rd, 2018, 08:35:27 PM IST


మాజీ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన జెడి లక్ష్మి నారాయణ ఇటీవల కొద్దీ రోజుల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నారని, అంతే కాదు ఆయనకు పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు పలు వార్తలు వచ్చాయి. అయితే నేడు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి విచ్చేసిన ఆయన అటువంటి వార్తలు అన్ని పుకార్లేనని కొట్టిపారేశారు. అంతేకాదు తనకు రాజకీయాలపట్ల ఆసక్తి లేదని, తనకు ప్రజల మధ్యన ఉండడమే ఇష్టమని స్పష్టం చేశారు. అలానే సమాజంలో మనుషుల్లో భక్తి భావం, ఆధ్యాత్మిక చింతన అనేది తగ్గడం వల్లనే చిన్నపిల్లలు మహిళల పై ఎన్నో అకృతాయ్లు జరుగుతున్నాయని అన్నారు.

ఇటీవల చిన్నపిల్లలపై జరిగిన కథువా, వున్నవ్ ఘటనలు బట్టి చూస్తే మనిషి యొక్క మానిసిక స్థితి ఎంత నీచానికి దిగజారిపోయిందో తెలుస్తోందని, అదే ప్రతిఒక్కరు తమలో విధిగా భక్తి, ఆధ్యాత్మికత అలవర్చుకుంటే మానసిక ప్రశాంతతతోపాటు మంచి ఆలోచనలతో జీవితాన్ని ప్రశాంతంగా ఆనందమయం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అలానే ప్రస్తుతం రాష్ట్రం లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం చూస్తుంటే కేంద్రప్రభుత్వం త్వరలోనే మన మొర ఆలకిస్తుందని, హోదా తప్పక వచ్చి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే కేవలం ఒకరో ఇద్దరో కాక మొత్తం రాష్ట్రంలోని ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ఇలా అందరూ హోదా కోరుతున్నారు కాబట్టి మోడీ కూడా ఆ విధంగా ఆలోచించి మనకు మంచి చేసే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments