చిరంజీవిని తక్కువ అంచనా వేసి దెబ్బైపోయిన అల్లు అరవింద్ !

Tuesday, January 31st, 2017, 08:30:28 AM IST

allu-arvind
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం 150’ తో ఇచ్చిన రీ ఎంట్రీ ఎంతో ఘనంగా సాగుతోంది. అయితే గతంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత కూడా రిజల్ట్ పై మెగా క్యాంపులోని పలువురిలో అనుమానాలు ఉన్నాయట. అందులో మొదటి వ్యక్తి అల్లు అరవింద్. సినిమా ఫైనల్ కాపీ చూసి, చిరంజీవి చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ రిజల్ట్ మరీ అంత గొప్పగా ఉండకపోవచ్చని అంచనా వేశారు. అందుకే తమ కుటుంబంలోని హీరోల సినిమాల్ని ఏదో ఒక మేజర్ ఏరియాలో సొంతంగా రిలీజ్ చేసుకునే ఆయన ఎంతో ప్రత్యేక ఉన్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.

సినిమా వీలైనంత భారీ ధరకు అమ్ముడుపోయే జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక అరవింద్ అంచనాలన్నీ పూర్తిగా తలకిందులయ్యాయి. ఆయన అనుకున్నట్టు సినిమా మోస్తారుగా కాకుండా భారీ విజయాన్ని దక్కించుకుని లాభాల పంట పండిస్తోంది. ఇప్పటికే 140 కోట్ల గ్రాస్ ను 100 కోట్ల షేర్ ను వసూలు చేసి అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లను లాభాల దిశగా నడిపిస్తోంది. దీంతో నాలుక కరుచుకున్న అరవింద్ చిరంజీవిని తక్కువ అంచనా వేశామే అనుకుని 151 చిత్రాన్నైనా నిర్మించాలని భావించారు. కానీ చరణ్ మాత్రం మొదటి సినిమాతోనే తండ్రి రూ. 70 కోట్ల దాకా లాభాలను మిగల్చడంతో 151 వ సినిమాని కూడా తానే నిర్మించాలని డిసైడైపోయాడు. దీంతో అరవింద్ కు చిరు రీ ఎంట్రీ అంశంలో నిరాశే మిగిలినట్టైంది.