ఇక నుంచి బన్నీ ఫ్యాన్స్ కి ఎదురు చూపులు తప్పవా..?

Tuesday, April 23rd, 2019, 09:38:30 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం తాలూకా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే మొదలు కానుంది.ఎప్పుడూ తన సినిమాల్లో ఒక సరికొత్త లుక్ ను పరిచయం చేసే బన్నీ ఈ సినిమా కోసం కూడా ఒక సరికొత్త లుక్ లో కనిపించేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు.రేపటి నుంచి షూటింగ్ మొదలు కాబోతుందన్న విషయం తెలిసిన బన్నీ అభిమానులకు ఒక పక్క ఆనందంతో పాటు మరోపక్క కాస్త టెన్షన్ గా కూడా ఉన్నారట.

ఎందుకంటే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సినిమాల్లో మరోసారి హారికా హాసిని వారు నిర్మిస్తున్నారు.దీనితో అజ్ఞ్యాతవాసి చిత్రానికి చేసిన విధంగా అప్డేట్స్ విషయంలో ఎక్కడ లేట్ చేస్తారా అని టెన్షన్ పడుతున్నారు.కానీ ఈ సినిమాకి బన్నీ తండ్రి అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ కూడా సంయుక్తంగా నిర్మిస్తుండడంతో అప్డేట్లు పక్కాగా ఉండొచ్చని మరికొంత మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమాకి ఏం చేస్తారో చూడాలి.బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూడో చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నారు.