“సైరా” నరసింహా రెడ్డి కోసం గోనగన్నా రెడ్డి సై..!?

Tuesday, November 20th, 2018, 09:40:57 PM IST


టాలీవుడ్ లో బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రాబోతున్న చిత్రం టాలీవుడ్ దిగ్గజం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న “సైరా” అని చెప్పాలి.దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మాత రామ్ చరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.అయితే ఈ చిత్రంలో ఇప్పటికే చాలా మంది అగ్ర తారలు నటిస్తున్నారన్న సంగతి కూడా తెలిసందే.ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తానని తెలుగు ప్రేక్షకులు ఎంత స్థాయిలో ఊహించుకున్నా సరే దానికి మించే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు సిద్ధమయ్యాడు అని తెలుస్తుంది.అయితే ఈ చిత్రానికి సంబందించిన ముఖ్య పాత్రల యొక్క ప్రవేశ సన్నివేశాలకు అల్లు అర్జున్ గొంతు తోనే ప్రారంభం అవుతాయని,అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.