అభిమాని చివరి కోరిక నెరవేర్చిన బన్నీ

Sunday, May 6th, 2018, 12:49:39 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను కలుసుకోవడంలో ఎప్పుడు ముందుంటాడనే చెప్పాలి. అయితే రీసెంట్ గా ఒక యువకుడు తన చివరి కోరిక అల్లు అర్జున్ ని చూడాలని చెప్పడంతో విషయం తెలుసుకున్న బన్నీ వెంటనే అతన్ని కలుసుకోవడానికి వెళ్లాడు. విశాఖపట్నంలోని అనాకపల్లిలో సాయి గణేశ్‌ అనే యువకుడు గత కొంత కాలంగా బోన్‌ కేన్సర్‌తో బాధితుడుతున్నాడు. అయితే అతని పరిస్థితి ఈ మధ్య విషమంగా మారడంతో యువకుడు అల్లు అర్జున్ ని చూడాలని అదే నా చివరి కోరిక అంటూ చెప్పడంతో బన్నీ దేవసాయి గణేశ్‌ దగ్గరికి వెళ్లి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. కొంత సేపు అతనితో మాట్లాడడంతో గణేష్ ఎంతగానో సంతోషించాడు. గతంలోను ఒక వృద్ధ మహిళ బన్నీని కలుసుకోవాలని ఉందని అనడంతో బన్నీ ఆమెను కూడా ఎంతో ఆప్యాయంగా కలుసుకున్నాడు.