మహేష్ కు పోటీగా అల్లు అర్జున్..!

Wednesday, December 5th, 2018, 12:50:09 PM IST

ఇటీవల ఏషియన్ సినిమాస్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఏ ఎమ్ బీ సినిమాస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే, వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ తో, అత్యాధునిక టెక్నాలజీతో విలాసవంతంగా నిర్మితమైన ఈ మెగా మల్టిప్లక్స్ దేశంలోనే టాప్ మల్టి ప్లక్స్ గా ఘనత సాధించింది. ఈ మల్టి ప్లేక్స్ పై టాలీవుడ్ సెలెబ్రిటీల కన్ను పడ్డట్టు తెలుస్తుంది. చాలా మంది సెలెబ్రిటీలు మల్టీ ప్లక్స్ బిజినెస్ లో అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టి ప్లేక్స్ బిజినెస్ లో అడుగు పెట్టె ఆలోచనలో ఉన్నాడట, ఈ మేరకు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ సునీల్ నారంగ్ తో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అన్ని కుదిరితే హైదరాబాద్ లోనే ఏ ఎమ్ బీ సినిమాస్ కు ధీటుగా మరో మెగా మల్టీ ప్లేక్స్ నిర్మించేందుకు బన్ని సన్నాహాలు చేస్తున్నాడట. ఈ డీల్ గనక ఓకే అయితే అమీర్ పేట్ లోనే ఈ మల్టీ ప్లక్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది, గతంలో ఒక వెలుగు వెలిగిన సత్యం థియేటర్ స్థలంలో ఉండచ్చని అంటున్నారు. ఈ క్రమంలో క్రేజ్ విషయంలో బన్నీ మహేష్ కు చెక్ చెప్పలేకపోయినా కూడా బిసినెస్ విషయంలో మాత్రం చెక్ చెప్పేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.