యువతి కేసుపై స్పందించిన అల్లు శిరీష్

Sunday, June 9th, 2013, 08:58:11 PM IST


శనివారం రాత్రి పబ్‌లో ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనపై వచ్చిన వార్తలపై అల్లు శిరీష్ స్పందించాడు. తాను ఎవరితో గొడవ పడలేదని శిరీష్ స్పష్టం చేశాడు. కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని మీడియా చానళ్లో శిరీష్ చెప్పాడు. తనపై ఆమె ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారన్నారు. ప్రముఖ హీరో తమ్ముడని మాత్రమే ఆ యువతి ఫిర్యాదు చేసిందన్నాడు. తన పేరు అనవసరంగా లాగుతున్నారని వాపోయాడు. తాను క్లబ్ కు వెళ్లి రాత్రి 12.30 గంటలకు వచ్చేశానని, గొడవ 2 గంటల ప్రాంతంలో జరిగిందని తనకు తెలిసిందన్నాడు. తనకు సంబంధం లేని దానిపై వివరణ ఎందుకు ఇవ్వాలని శిరీష్ ప్రశ్నించాడు.

శనివారం రాత్రి మద్యం మత్తులో న్యూఢిల్లీకి చెందిన ఓ యువతి పట్ల శిరీష్ అసభ్యంగా ప్రవర్తించాడని వార్తా చానళ్లలో జోరుగా వార్తలు వచ్చాయి. డీజేగా పనిచేస్తున్న ఆ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే అందులో అల్లు శిరీష్ ఉన్నాడని, కేసు నమోదు కాకుండా పెద్దల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు శిరీష్ ఈ సంఘటనపై వివరణ ఇచ్చాడు.