ఆక‌తాయికి అమ‌ల కోటింగ్

Monday, September 19th, 2016, 03:22:47 PM IST

amala
కేర‌ళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు జోరుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ల‌లో మ‌ళ్లీ మేనేజ‌ర్లను పుర‌మాయించి అప్ డేటెడ్ ప్రోఫైల్ ను మూవ్ చేస్తోంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో ఒక సినిమా, త‌మిళ్ లో వ‌డ చెన్నై లో న‌టిస్తోంది. అయితే ఇటీవ‌ల విడాకుల‌కు అప్లై చేసిన అమ‌ల పాల్‌కు ఓ అక‌తాయి నుంచి ఊహించ‌ని ఎటాక్‌ ఎదురైంది. విడాకులు తీసుకున్న అమ్మాయిలు..హాట్ గా…నాటీగా ఉంటారంటూ కామెంట్ చేశాడు స‌ద‌రు ఆక‌తాయి. ట్విట్ట‌ర్‌ లో అమ‌లాపాల్ అని పేరును మెన్ష‌న్ చేయ‌క‌పోయినా.. ఆ కామెంట్ త‌న‌పైనేన‌ని భావించిన‌ అమ‌లాపాల్ దీనిపై సీరియ‌స్ అయింది.

నీ ఆలోచ‌న‌లు త‌ప్పు దారిలో ఉన్నాయి. మైండ్ సెట్ మార్చుకో. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించ‌డం నేర్చుకో బాబు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌న‌పై అప్ప‌ట్లో చాలా రూమ‌ర్లు వ‌చ్చినా వాటిపై ఏనాడూ ఇంత‌గా రెస్పాండ్ కాలేదు. కానీ ఆడ‌వాళ్లనంద‌ర్నీ ఉద్దేశించి ట్వీట్‌ చేసిన స‌ద‌రు ఆక‌తాయికి గ‌ట్టిగానే కోటింగ్ ఇచ్చింద‌ని మ‌హిళామ‌ణులంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.