అమ‌రావ‌తికి వ‌ర‌ద ముప్పు.. చెక్ పెట్టేశారిలా!?

Sunday, September 16th, 2018, 12:49:02 PM IST

కొండ‌వీటి ఎత్తిపోతల ప‌థ‌కంతో రాజ‌ధాని అమ‌రావ‌తికి వ‌ర‌ద ముప్పు త‌ప్పిన‌ట్టేనా? భీక‌రంగా వ‌ర్షాలు కురిస్తే చిత్త‌డి చిత్త‌డిగా మారిపోయే కృష్ణా బేసిన్‌ ప‌రిస్థితేంటో? అక్క‌డ భ‌వంతులు నిల‌బ‌డ‌తాయా.. నిల‌బ‌డ‌వా? అంటూ నిరంత‌రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే ఇటీవ‌ల‌ నూత‌న నిర్మాణాలైన అసెంబ్లీ భ‌వంతుల్లోకి వ‌ర‌ద నీరు చేర‌డం, గోడ‌లు కూల‌డం వ‌గైరా వ‌గైరా ఎపిసోడ్స్ ఏపీ ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర‌పెట్టాయి. బెజ‌వాడ‌- అమ‌రావ‌తి-గుంటూరు బెల్ట్‌లో జిగట నేల భ‌వంతుల నిర్మాణానికి మ‌రీ అంత అనుకూలం కాద‌ని స‌ర్వేలు చెప్పాయి. అయినా రాజ‌ధానిని ప్ర‌క‌టించారు. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో నిర్మాణాలు చేప‌ట్టారు. అయితే ఇదంతా బాబు ప‌ట్టుద‌ల వెన‌క ఉన్న వ్యూహం అన‌డంలో సందేహం లేదు. ఆ బెల్టును ఖ‌రీదైన రియాల్టీ హ‌బ్‌గా మార్చ‌డం అన్న‌ది కూడా ఈ ప్లాన్‌లో ఒక భాగం.

అదంతా అటుంచితే నేడు ఏపీ సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ని సీఎం ఆవిష్క‌రించారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో భవిష్యత్తులో రాజధానికి తప్పిన వరద ముంపు త‌గ్గిపోతుంద‌ని జోశ్యం చెబుతున్నారు. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని కొండవీడు సహా ఐదు వాగుల వరద నీటిని కృష్ణా నదిలోకి లిఫ్ట్ చేసేలా కొండవీడు లిఫ్ట్ నిర్మాణం చేప‌ట్టార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. మొత్తం 16 పంపులతో లిఫ్ట్ స్కీమ్ నిర్మించారు. ఒక్కో పంపుతో 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామ‌ర్థ్యం ఉంది. మొత్తం 5250 క్యూసెక్కుల నీటిని ఈ పథకం ద్వారా వరద నీటిని కృష్ణా నదిలోకి పంప్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. మరింత ఎక్కువ వరద వస్తే.. రెగ్యులెటర్ ద్వారా బకింగ్ హం కెనాల‌క్ష‌కు నీటిని లిఫ్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేశార‌ట‌. మొత్తం రూ. 222 కోట్లతో కొండవీడు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్త‌యింద‌ని చెబుతున్నారు. 365 రోజుల్లో కొండవీడు లిఫ్ట్ నిర్మాణం పూర్త‌యింద‌ని చెబుతున్నారు. ఎత్తిపోత‌ల ప‌థ‌కం రాజ‌ధాని ముప్పు తొల‌గిస్తే అంత‌కంటే ప్ర‌జ‌ల‌కు మేలు ఏం ఉంటుంది? ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జ‌ల సొమ్ముల్ని వెద‌జ‌ల్లి నిర్మాణాలు చేప‌డుతున్నందుకు అవి సుస్థిరంగా ఉండ‌డం ఎంతో ముఖ్యం. అది పాల‌కుల స్వార్థ‌ప్ర‌యోజ‌నాల‌కు ఆడే ఆట కాకూడ‌ద‌న్న‌ది అంద‌రి విన‌తి.

  •  
  •  
  •  
  •  

Comments