1000 కోట్ల కుంభ కోణంలో చిన‌బాబు

Tuesday, September 20th, 2016, 04:57:42 PM IST

nara-lokesh1
విశాఖ ప‌ట్ట‌ణం ఏపీకి ఇప్పుడు వాణిజ్య రాజ‌ధాని. స్మార్ట్ సిటీ ప్ర‌క‌ట‌న‌తో ఏపీకిది గుండెకాయ లాంటి న‌గ‌రం. ఇప్పుడిప్పుడే భూ క‌బ్జాలు పెట్రేగిపోతున్నాయ‌న్న క‌థ‌నాలు త‌రుచూ వ‌స్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సీఏం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ( చిన‌బాబు) గురంచి వైకాపా నేత అమ‌ర్ నాథ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

విశాఖ భూదందాలో లోకేష్ కీ రోల్ పోషిస్తున్నాడ‌ని ఆరోపించారు. సిటీ లో ముఖ్య‌మైన ప్రాంతంలో వెయి కోట్ల విలువ గ‌ల స్థలానికి సంబంధించిన చిన‌బాబు ఇన్వాల్స్ మెంట్ ఉంద‌ని ఆరోపించారు. దానికి సంబంధించిన ప‌క్కా ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఓ టీవీ చ‌ర్చ‌లో బ‌హిరంగంగా చెప్పడం విశాఖ వాసుల‌ను కంగు తినిపించిన‌ట్లైంది. వారం రోజుల్లో ఆ అధారాల‌ను మీడియా ముందు ప్ర‌వేశ పెడ‌తాన‌ని స‌వాల్ విస‌ర‌డం అన్ని రాజ‌కీయ పార్టీల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వాస్త‌వానికి ఈ వ్వ‌వ‌హారం అధికార ప్ర‌భుత్వానికి..రియాల్ట‌ర్ల‌కు మ‌ధ్య కొన్నాళ్ల నుంచి వివాదం న‌డుస్తోందిట‌. ఇటీవ‌ల చిన‌బాబు ఎంట్రీతో ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు అమ‌ర్ నాథ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు అధికార పార్టీలోనూ పెను సంచ‌ల‌నం అవ్వ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.