శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. అమెజాన్ అఫర్

Saturday, October 28th, 2017, 07:00:39 AM IST

ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో నెటిజన్స్ ఎక్కువగా మొబైల్స్ నే కొంటున్నారు. దీంతో ఆన్లైన్ సంస్థలు కూడా వారిని మరింత ఆకర్షించేందుకు భారీ ఆఫర్స్ ని అందిస్తోంది. ఇటీవల కాలంలో దీపావళి దసరా సందర్భంగా రికార్డ్ స్థాయిలో ఆఫర్స్ ని అందించాయి. ఇక నెల చివరలో కూడా భారీ డిస్కౌంట్లతో కూడిన ఆఫర్స్ ని అందిస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా శాంసంగ్ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ మూడు రోజులు ఆ కంపెనీకి సంబందించిన ఫోన్లను 4700 రూపాయల వరకు డిస్కౌంట్ లను ఇస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా జియో 90 జీబీ వరకు డేటాను ఉచితంగా పొందవచ్చునట.

ఆఫర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ5 మోడల్ పై రూ.4,510 భారీ డిస్కౌంట్‌.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ9 ప్రో రూ.2,300 డిస్కౌంట్

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ 5 ప్రో – ఆన్ 7 ప్రోపై రూ.800 ఫ్లాట్ డిస్కౌంట్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఎ 7 – ఏ5ల‌పై రూ. 4000 డిస్కౌంట్

శాంసంగ్‌ గెలాక్సీ జే5పై రూ .900 ఫ్లాట్ డిస్కౌంట్