అలా చేస్తే అమెజాన్ ఎకౌంట్ పోయినట్లే!

Wednesday, May 23rd, 2018, 10:00:32 PM IST

ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మునిగి తేలుతుండడం కామన్ అయిపొయింది. ఈ బిజీ బిజీ లైఫ్ లో తీరిక లేక షాపింగ్ కు వెళ్లే ఓపిక లేక స్మార్ట్ ఫోన్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు. పైగా ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు ఆఫర్లు కూడా పోటీ పడుతూ ప్రకటిస్తుండడంతో నెటిజన్స్ ఎగబడి కొనేస్తున్నారు. ఇకపోతే కంపినీలు ప్రవేశపెట్టిన కొన్ని పాలసీ ల కారణంగా నష్టాలను చూడాల్సి వస్తోంది.

ఏదైనా వస్తువులను కొన్నాక అది నచ్చకుంటే ఈజీగా తిరిగి వెనక్కి పంపవచ్చు అనే ఈజీ రిటర్న్స్ పాలిసాని అందుబాటులో ఉంచింది. అయితే ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ఆలా చేస్తున్న కస్టమర్స్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రతి సారి బుక్ చేసిన ప్రాడక్ట్ ను వెనక్కి పంపే అలవాటు ఈ మధ్య ఎక్కువైపోయిందని సంస్థ అలాంటి ఎకౌంట్స్ పై వేటు వేయడానికి సిద్ధమైంది. కారణం చెప్పకుండా ఆ విధంగా చేసే ఎకౌంట్లను బ్యాన్ చేసేస్తున్నారు. ఈజీ రిటర్న్స్ పాలిసీ కారణంగా సమస్యలు ఎక్కువవుతున్నాయని 12 నెలల్లో లోపు కొనుగోలు చేసి వెనక్కి పంపిన ప్రాడక్ట్ కు సమాధానం చెప్పాలని మెయిల్ ద్వారా కస్టమర్లకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.

  •  
  •  
  •  
  •  

Comments