“అమెజాన్” జైత్ర యాత్ర: మైక్రోసాఫ్ట్ ను అధిగమించిన అమెజాన్..!

Wednesday, January 9th, 2019, 10:50:08 AM IST

24ఏళ్ల అమెజాన్ కంపెనీ ప్రపంచ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ను అధిగమించింది, సోమవారం ట్రేడింగ్ ముగిసి సమయానికి 796.8 బిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకుంది, దీంతో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ కంపెనీగా నిలిచింది. అప్పటివరకు మైక్రోసాఫ్ట్ 783 బిలియన్ డాలర్లతో ఈ స్థానంలో ఉండేది, గత నెలలోనే మైక్రోసాఫ్ట్ ఆపిల్ ను అధిగమించి ప్రధమ స్థానానికి చేరింది. అమెజాన్ ఈ స్థాయికి చేరుకోక ముందు ఎన్నో ఒడిదుడుకులను చవి చూసిందని చెప్పాలి, సెప్టెంబర్ లో 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాపిటలైజెషన్ తో దూసుకుపోయింది, తర్వాతి తరిమాసికంలో 2008 ఆర్థిక మాంద్యం నాటి నుండి చవి చూడని నష్టాన్ని చూసింది. అయినప్పటికీ నూతన సంవత్సరం ప్రారంభమయ్యాక తోలి నాలుగు రోజుల ట్రేడింగ్ గడిచిన సమయానికి ప్రపంచంలోనే నంబర్ వన్ పబ్లిక్ కంపెనీ స్థాయికి చేరుకోగలిగింది.

అమెజాన్ కన్స్యూమర్ గ్రూప్, ఐటీ విభాగాలలో తనకున్న సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ తో కొత్త అవకాశాలను సృష్టించుకునేందుకు ఉన్న హద్దులన్నిటిని చెరిపేయగలిగింది. బ్రియాన్ వైసర్ అనే పైవోటల్ రీసెర్చ్ గ్రూప్ సంస్థకు చెందిన విశ్లేషకుడు సోమవారం తమ క్లైంట్స్ కు 18% పెరుగుదలతో 1,920 బిలియన్ డాలర్ల “బై” రేటింగ్ ను సూచించారు. సోమవారం అమెజాన్ 3.4 శాతం పెరుగుదలతో 1,629 బిలియన్ డాలర్లకు చేరుకోగలిగింది. దీంతో 2019లో 8.5 శాతం పెరుగుదల పొందింది అమెజాన్ స్టాక్. అమెజాన్ పెట్టుబడిదారులను ప్రధానంగా క్లౌడ్, ఈ -కామర్స్, మంచి లీడర్ షిప్ టీం, వంటి అంశాలలో ఆకర్షిస్తుంది.

క్లౌడ్ విభాగంలో మైక్రోసాఫ్ట్ వేగవంతంగా ఎదుగుతున్న సమయంలో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషించింది. సినర్జీ రీసెర్చ్ గ్రూప్ ఇచ్చిన సమాచారం ప్రకారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ పబ్లిక్ క్లౌడ్ మార్కెట్లో 23బిలియన్ డాలర్ల షేర్ అధిగమించి మొత్తం మార్కెట్లో 40శాతం వాటితో దూసుకుపోతోంది. భౌగోళికంగా విస్తృతి చెందుతున్న అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ 140కి పైగా సేవలు అందిస్తూ లక్షలాది కస్టమర్లను కలిగి ఉంది. ప్రస్తుతం హాంగ్ కాంగ్, ఇటలీ, దక్షిణాఫ్రికాలలో విస్తరించనున్న అమెజాన్ క్లౌడ్, యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుండి 10బిలియన్ డాలర్ల కీలక కాంట్రాక్ట్ పొందనుంది. ఇటీవలి త్రైమాసికంలో అమెజాన్ 16బిలియన్ డాలర్ల నుండి 17.8 బిలియన్ డాలర్లకు చేరుకోగలిగింది. అమెజాన్ వివిధ విభాగాలకు వ్యాప్తి చెందినప్పటికీ తన కోర్ విభాగమైన ఈ – కామర్స్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అమెరికాలో దాదాపు 90శాతం వరకు అమెజాన్ రెవిన్యూ రిటైల్ సేల్స్ నుండే వస్తోంది. అమెజాన్ పెరుగుదలలో అలెక్సా, హెల్త్ విభాగాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెజాన్ లో ఉన్న ప్రత్యేక లీడర్ షిప్ టీం వల్లే ఇతర సంస్థల నుండి అమెజాన్ ను ప్రత్యేకంగా నిలుపుతోందని సీఈఓ “జెఫ్ బెజోస్” అన్నారు. ఫేస్ బుక్ ప్రైవసీ స్కాండల్స్, చైనాలో ఆపిల్ పడ్తున్న ఇబ్బందులతో పోలిస్తే అమెజాన్ షేర్లు కొనటంలో రిస్క్ తక్కువని భావించటం వల్లే పెట్టుబడిదారులు అమెజాన్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.