బుధ‌ గ్ర‌హంలో అంబానీ కూతురు పెళ్లి?

Thursday, September 20th, 2018, 08:35:10 PM IST

అంబానీల ఇంట పెళ్లంటే ఎలా ఉండాలి? మేళ‌తాళాల‌తో ఊరూ వాడా మార్మోగిపోయేలా పెళ్లి చేస్తే స‌రిపోతుందా? వ‌రుడు కోరినంతా క‌ట్నం, సారి ఇంటికి పంపిస్తే చాల‌నుకుంటున్నారా? అలా చేసేవాళ్లు అంబానీలు ఎందుక‌వుతారు? ప్ర‌పంచంలోనే ది బెస్ట్ కుబేరులుగా ఎందుకు పిలిపించుకుంటారు?

ఏదో ఒక స్పెష‌ల్ ఉండాలి. కుదిరితే పండోరా, కుద‌ర‌క‌పోతే బుధ‌గ్ర‌హం ఏదో ఒక చోటికి తీసుకెళ్లి అక్క‌డ పెళ్లి జ‌రిపించాలి. ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే ఉన్నారు ది గ్రేట్ అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ గారాల కుమార్తె ఇషా అంబానీ పెళ్లి, పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమాల్ వార‌సుడు ఆనంద్‌ పిరమాల్‌ తో ఫిక్స‌యింది. ఇంచుమించు పండోరాని మ‌ర‌పించే `లేక్ కోమో- విల్లా బల్బియానో`లో తొలుత నిశ్చితార్థ వేడుక‌ను ప్లాన్ చేశారు అంబానీలు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండోరోజు సంగీత్‌, డిన్నర్ అంతే గ్రాండ్‌గా ప్లాన్ చేశార‌ట‌. ది బెస్ట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్స్‌, రాజ‌కీయ నాయ‌కులు, బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ ఈవెంట్‌కి ఎటెండ్ కానున్నారు. 2018 ఆరంభంలోనే మహాబలేశ్వర్‌లోని ఓ ప్ర‌ఖ్యాత దేవాల‌యంలో ఆనంద్ .. ఇషా అంబానీకి ప్రపోజ్‌ చేశాడు. అటుపై ఇరు కుటుంబాల అంగీకారంతో మేలో పెద్ద‌ల ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్ప‌టికి డూడుడూ పీపీపీకి టైమొచ్చింద‌న్న‌మాట‌! నిశ్చితార్థ‌మే ఈ రేంజులో ప్లాన్ చేస్తే, ఇక పెళ్లి ఇంకే రేంజులో ఉంటుందో.. బుధ‌గ్ర‌హానికి టిక్కెట్ కొడ‌తారా? లేక మ‌రో పండోరాకి వెళ్లిపోతారా?