అంబానీ కారు డ్రైవర్ ముందు సాఫ్ట్ వేర్ కూడా బలాదూరే !

Tuesday, October 31st, 2017, 05:40:57 PM IST

భారతదేశంలోనే అత్యంత ధనికుల జాబితాలో మొదటి స్థానాన్ని కల్పించుకున్న ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవ్వరైనా సరే డబ్బు గురించి ఏదైనా చర్చలు జరిపితే అంబానీ అనే పేరు తప్పకుండా వాడతారు. అంబానీ కరెంట్ బిల్లే లక్షల్లో ఉంటుంది. అడుగు బయపెడితే లక్షల్లో ఖర్చు. ఇక సరదాగా బయటకి వెళితే కోట్లల్లో ఖర్చు జరగడం చాలా కామన్. మరి వారి దగ్గర పనిచేసే వారికి జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్థాయిలో జీతాలు ఉంటాయి.

అంబానీ డ్రైవర్ జీతం నెలకి 2 లక్షల రూపాయలట. అంతే కాకుండా ప్రతి పండగలకి బోనస్. అంబానీ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరిగినా శుభవార్తలు వచ్చినా ఊహించని బహుమానాలు. అక్కడే బెడ్ రెస్ట్ అలాగే మంచి ఫుడ్ కూడా ఫ్రీ. మరి ఆ డ్రైవర్ జాబ్ ని దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు. మొదట ఓ ప్రైవేట్‌ డ్రైవింగ్‌ ఏజెన్సీని అంబానీ మేనేజర్ సంప్రదిస్తారు. అందులో బెస్ట్ అనిపించిన వారికి వారి స్టైల్ లో కఠిన పరీక్షలని పెడతారు. ఆ తర్వాత బెస్ట్ అనిపించిన వారిని సెలెక్ట్ చేసి శిక్షణను ఇచ్చి ఫైనల్ చేస్తారు.

  •  
  •  
  •  
  •  

Comments