టీడీపీ-కాంగ్రెస్ కలిస్తే అది రాజకీయ వ్యభిచారమే..అంబటి సంచలనం!

Thursday, November 1st, 2018, 04:56:08 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.ఇప్పుడు జగన్ మీద జరిగినటువంటి దాడితో మరింత నిప్పులు చెరుగుతున్నారు.అయితే ఇదిలా ఉండగా అటు తెలంగాణా ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటన ఇవ్వడం కూడా ఇక్కడి తెలుగుదేశం పార్టీలోని అభిమానులకే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యి చంద్రబాబు ఇక్కడ కూడా అలా చేస్తే వారి పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది అని చెప్పిన నేతలు కూడా లేకపోలేరు.

ఇప్పుడేమో బాబు గారు రాహల్ గాంధీని కలవడానికి వెళ్లగా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.వైసీపీ కి చెందినటువంటి అంబటి రాంబాబు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని వారిని తల్లి కాంగ్రెస్ అని అన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు చేసిన పనేమిటి అని ప్రశ్నించారు.భారత రాజకీయ పార్టీల్లో ఎవరు ఏ పార్టీతో అయినా సరే కలవొచ్చు కానీ అసలు కాంగ్రెస్ కే వ్యతిరేఖంగా పార్టీ పెడితే ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే అది రాజకీయ వ్యభిచారమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments