కోహ్లీ బ్యాట్ వల్లే బాగా ఆడాను: అంబటి రాయడు

Wednesday, May 30th, 2018, 05:32:32 PM IST

అంబటి రాయుడు తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది అద్భుతమైన ఆటతో మెరిసాడని చెప్పవచ్చు. ఐపీఎల్ లో 16 మ్యాచ్ లు ఆడిన రాయుడు 602 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగవ స్థానంలో నిలిచాడు. అయితే రాయుడు ఈ సారి ఆ స్థాయిలో ఆడటానికి ఒక బలమైన కారణం ఉందట. కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఒక బ్యాట్ తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందట. ఈ విషయాన్ని ఇటీవల రాయుడు హర్భజన్ తో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ప్రతి సారి బాగా ఆడటంలో విరాట్ బ్యాట్ కీలకమని అయితే ఆ విషయం తెలిసి ఓ సారి కోహ్లీ తిట్టుకుంటూ బ్యాట్ ఇచ్చినట్లు రాయుడు తెలిపాడు. కానీ నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కోహ్లీ కూడా ఒక కారణం. అతను ఇచ్చిన సలహాలు బ్యాట్ లు నా కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి. ఆ బ్యాట్ వల్లే సెంచరీ చేశాను, ఐపీఎల్ లో అందరూ మెచ్చుకున్నారు అంటే కోహ్లీ కారణమని రాయుడు వివరించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది రాయుడుని 2.20 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి చేసింది. గతంలో రాయుడు ముంబై జట్టుకు ఆడాడు. అతనితో పాటు ముంబై ఆటగాడిగా కొనసాగిన హర్భజన్ ని కూడా చెన్నై కొనుగోలు చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments