అణు యుద్ధం తప్పేలా లేదు.. అగ్ర దేశానికి వార్నింగ్

Tuesday, October 17th, 2017, 11:53:57 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను తన అణు పరీక్షలతో షాక్ కి గురి చేస్తోన్న దేశం దక్షిణ కొరియా. పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా ఆ దేశం పట్టించుకోకుండా అగ్ర దేశంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. అగ్రరాజ్యం అమెరికా తమపై పెత్తనం చెలాయించడానికి చూస్తోంది అంటూ.. ఆ దేశ అధ్యక్షడు గత కొంత కాలంగా వివాదాస్పదం వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అణు పరీక్షలను నిర్వహిస్తూ ట్రంప్ కి చాలా కోపం తెప్పిస్తున్నాడు.

అయితే వీరి కోపాల వలన పక్క దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే సమీప దేశాలు చాలా వరకు నష్టం కలగవచ్చు అందులోను వారు అణు బాంబులతో యుద్ధం చేస్తే ఆ నష్టం ఏ స్థాయిలో వుంతుందో అని అందరు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా ఉత్తర కొరియా తన పద్దతులను మార్చుకోవడం లేదు. ఇటీవల మరో సారి ఐక్యరాజ్య సమితి ముందే ఉత్తర కొరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ కమిటీలో కొరియా రాయబారి కిమ్‌ ఇన్‌ ర్యాంగ్‌ మాట్లాడుతూ.. మా అణ్వాయుధా, బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్షలను ఎంత మాత్రం ఆపబోమని చెబుతూ.. అమెరికా తన బుద్దిని మార్చుకోవాలి. అదే విధంగా తమని ఒత్తిడికి గురి చెయ్యాలని చూస్తోంది. వారు కూడా అణు హెచ్చరికలను పూర్తిగా ఆపేంతవరకు తాము కూడా అణు పరీక్షలను ఆపబోమని హెచ్చరికను జారీ చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అణు యుద్ధం తప్పేలా లేదని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.