హెచ్‌–1బీ వీసాపై అమెరికా న్యూ రూల్ ..ఇక కష్టమే!

Friday, February 23rd, 2018, 02:34:17 PM IST

అమెరికా రారాజు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. తన సరికొత్త ఆలోచనలతో ఓ వైపు అక్కడి వారిని ఆకట్టుకుంటూనే మరోవైపు విదేశీయులకు భయాన్ని కలిగిస్తున్నాడు. అధ్యక్ష పదవికి ముందు ఎలక్షన్స్ ప్రచారంలో ట్రంప్ చెప్పిన కఠిన నిర్ణయాలను మరచిపోకుండా అమలు పరుస్తున్నాడు. దీంతో ప్రస్తుతం అక్కడ విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా హెచ్-1బీ వీసా విధానంలో మార్పులతో జరుగుతాయని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే అమెరికా ప్రభుత్వం రీసెంట్ గా హెచ్ -1బీ వీసా విధానంలో కొత్త తరహా సవరణని కలుపబోతున్నారు. దీంతో భారత ఐటి కంపెనీలకు అలాగే ఇతర కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. హెచ్‌1బీ వీసాల కొరకు అప్లై చేసుకునే భారత ఐటీ కంపెనీలు వివరాలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాకు పపంపుతోన్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలను కూడా ఎక్కువగానే ఇవ్వాలి. ఏ అందులో ఏ మాత్రం తేడా వచ్చినా వీసా రావడం కష్టమే. 2019 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ 2 నుంచి ఈ హెచ్‌1బీ వీసాల దరఖాస్తు విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంతకుముందు మూడేళ్ళ వరకు అమలయ్యే వీసాలను జారీ చేసే విధాన్నాన్ని మారుస్తున్నట్లు చెప్పారు. ఈ విధంగా అమలయ్యే వీసాలు ఇక నుంచి ఎక్కువ కాలం ఉండదు. కొంత కాలంమాత్రమే చెల్లు బాటయ్యేలా కొత్త రూల్స్ వస్తున్నాయని అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments