పాకిస్తాన్ కు మరో షాకిచ్చిన అమెరికా!

Sunday, September 2nd, 2018, 09:34:24 PM IST


అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ను ఇచ్చింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పాక్ నుతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో కొత్త ప్రభుత్వం వల్ల అన్ని మంచి పరిణామాలే అని ఆశపడిన పాక్ కు ఊహించని విధంగా అమెరికా ఒక చేదు వార్తను అందించింది. పాక్ ఆర్మీకి సహాయంగా ఇవ్వాల్సిన 300 మిలియన్ డాలర్లను (2130. 5 కోట్లను) ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పింది.

ఉగ్రవాదాన్ని అంతమొందించాలని గత కొన్నేళ్లుగా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను లేకుండా చేయాలనీ ఆ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిలిటెంట్లపై దాడులు చేసి ఉగ్రవాదాన్ని అంతమొందించాలని అమెరికా సహాయం చేస్తుంటే పాకిస్తాన్ ఆ ప్లాన్ సక్సెస్ చేయడం లేదు. డబ్బును సక్రమంగా ఉపయోంచకపోవడం వల్ల పాకిస్తాన్ కు సహాయనిధిని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇదివరకే పాకిస్తాన్ కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా ఆపేసింది. ఇక ఇప్పుడు కూడా సైనిక దళాలకు రావలసిన డబ్బును నిలిపివేయడంతో ఆ దేశానికి తీరని లోటనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments