ట్రంప్ నిర్ణయానికి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది!

Tuesday, January 2nd, 2018, 01:39:03 PM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన రీసెంట్ గా చేసిన ఒక ట్వీట్ తో పాక్ కి గట్టి దెబ్బ పడింది. ప్రపంచ దేశాలు ఎంత ముందుకు వెళుతున్నా ఇంకా పాక్ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఎన్ని దేశాలు ఆ దేశంపై ఆరోపణలు చేసినా కూడా పాక్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్ పై పలు మార్లు విమర్శలు చేస్తూ అగ్రరాజ్యం అమెరికాపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది.

అయితే ఇటీవల ట్రంప్ ఆ దేశానికి ఎంత సహాయం చేసినా కూడా తమకు చేస్తున్నది ఏమి లేదని ఇంతవరకు మూర్ఖంగా పాక్ కు ఆర్థిక సహయాన్ని అందించామని ట్రంప్ తెలిపాడు. ఇక అమెరికా ఫైనల్ గా ఇప్పటి నుండి పాక్ కు ఇవ్వాల్సిన 1600 కోట్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీంతో పాక్ కు ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే పాక్ ప్రధాని అబ్బాసీ ఆ విషయం గురించి అమెరికా ప్రతి నిధులతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. ఇక ఇది అనువుగా చేసుకొని చైనా మాత్రం అమెరికా పై ఉన్న కసితో మరో సారి పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. పాక్ చాలా మంచి దేశమని అమెరికా అలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని చైనా ఆరోపణలు చేసింది.