ఛ.. సిరియా కోసం7 లక్షల కోట్ల డాలర్లు వృధా చేశాం : డోనాల్డ్ ట్రంప్

Friday, March 30th, 2018, 02:38:46 PM IST

గత కొద్దిరోజుల క్రితం సిరియా ఉగ్రవాదుల వల్ల జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మొదలగునవి తెలిసిన విషయాలే. అయితే సిరియా నుంచి తమ దళాలను త్వరలో ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధాల కోసం అమెరికా దేశం ఏడు లక్షల కోట్ల డాలర్లు వృధా చేసిందన్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు అమెరికా అన్ని విధాలా తమ సాయ శక్తులా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసిందన్నారు. ఇస్లామిక్ స్టేట్‌ను రూపుమాపుతున్నామని, త్వరలోనే సిరియా నుంచి బయటకు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. యుద్ధాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసి.. దేశంలో మౌళిక సదుపాయాలను కల్పించుకోలేకపోయామని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేసారు. ఒహియాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments