కొన్ని గంటలు ఆగితే మీడియా ఆశ్చర్య పోతుందా..? ట్రంప్ ఆశ్చర్య పోతాడా…?

Tuesday, November 8th, 2016, 10:11:47 AM IST

TRUMP
గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్న మహోన్నతమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘట్టానికి మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. మునుపెన్నడూ లేని విధంగా హోరా హోరిగా సాగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపెవరిదో తెలిసిపోతుంది. నూతన అమెరికా అధ్యక్ష పదవిని అమెరికన్లు ఎవరికి కట్టబెట్టనున్నారో తెలిసిపోతుంది. అయితే హిల్లరీ క్లింటన్ తన గెలుపు పై ఎలాంటి ప్రకటన చేయక ముందే, ట్రంప్ మాత్రం తన గెలుపుపై సంచలన ప్రకటన చేశాడు. మరి కొద్ది గంటలు ఆగుతే ప్రపంచ దేశాలతో పాటు, మీడియా మొత్తం ఆశ్చర్య పోయేలా ఫలితాలు వెలువడతాయని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైట్ హౌస్ లో తను కాలు పెట్టనున్నానని, స్వింగ్ రాష్ట్రాలు అన్నింటిలో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. అయితే దీనిపై ప్రజలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియా షాక్ అవుతుందో లేదా ట్రంప్ కే షాక్ తగులుతుందో కొన్ని గంటల్లో తేలుతుందని చెబుతున్నారు.