పొత్తులో ఉండే సమస్యలు త్వరలోనే తెలుస్తాయి: అమిత్ షా

Tuesday, May 22nd, 2018, 03:50:32 AM IST

2019 ఎన్నికలకు ఎంతో కీలకమైన కర్ణాటక ఎన్నికలు ఎవరు ఊహించని ఫలితాన్ని ఇచ్చాయి. భారత జనతా పార్టీకి 8 సీట్ల విలువ ఈ ఎన్నికలతో తెలిసింది. ఒక్క సీటైనా ఎంతో ముఖ్యమని ఇక నుంచి ఏ స్థానాలను అంత ఈజీగా తీసుకోకూడదని డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ హాయంతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మొదటి సారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి అమీత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ..ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోయి ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్ధం కావడం లేదు. ఆ పార్టీలో సగం మంది మంత్రులు ఓడిపోయారు. ఇక సగంలో సగం సీట్లను కూడా గెలవని జేడీఎస్ సంబరాలు కూడా అర్ధం లేనిదని అమిత్ షా కౌంటర్ వేశారు.

అంతే కాకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఒక స్థానం నుంచి ఓడిపోయారని బీజేపీ ఎక్కువ సీట్లు అందుకుందని చెబుతూ కర్ణాటక ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల కమిషన్ పనితీరు ఈవీఎం లు నచ్చుతాయి. లేకుంటే వారికి అవి నచ్చవు. ఇక పొత్తులు బాగానే పెట్టుకున్న ఇరు పార్టీలకు పొత్తులో అసలు సమస్యలు ఎలా ఉంటాయో త్వరలోనే తెలుస్తుంది. ప్రజల ప్రేమ ఉంటేనే పవర్ వస్తుందని అనవసరమైన ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ ముందుంటుందని అమిత్ షా తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments