అమితాబ్ కు పురస్కారం అందజేసిన కేసీఆర్

Sunday, December 28th, 2014, 03:21:12 AM IST

kcr-amithab
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు నగదు 5 లక్షల రూపాయలతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితోపాటు పలువురు రాజకీయ, సినిమారంగ ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకుముందు అమితాబ్ సీఎంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయినందుకు కేసీఆర్‌కు అమితాబ్ అభినందనలు తెలిపారు.

బిగ్ బికి అక్కినేని అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. సినీ పరిశ్రమను మరింత విస్తరించాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. సినీ ప్రముఖులతో చర్చించి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సినీపరిశ్రమ ఇక్కడ నుంచి ఎక్కడికీ తరలిపోదని చెప్పారు.