కేసీఆర్‌పై షా విసిరిన ఛాలెంజ్‌!

Sunday, September 16th, 2018, 02:34:41 PM IST

తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా ద‌ళితుడిని చేసే ధైర్యం కేసీఆర్‌కు ఉందా?తెలంగాణ‌కు తొలి ముఖ్య‌మంత్రిగా ద‌ళితుడ్ని చేస్తాన‌న్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మాట త‌ప్పి ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కారు.రెండోసారి అయినా ఓ ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేసే దైర్యం కేసీఆర్‌కు ఉందా? అని బిజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా స‌హ‌ల్ విసిరారు.

బిజేపీ ఎవ‌రితో పొత్తులు లేకుండా ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డి అంద‌రికీ గ‌ట్టి ఇస్తుంద‌ని అన్నారు. ఆప‌ద్ద‌ర్మ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఎలాంటి పొత్తులు లేవు. స్నేహ‌పూరిత వాతావర‌ణం అస‌లే లేదు. పొత్తుల విష‌యంలో పుకార్లే కానీ వాస్తవం లేద‌ని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్‌, మ‌జ్లిస్‌, టీఆర్ ఎస్‌ల‌కు వ్య‌తీరేకంగా పోటీ చేసి బిజేపీ స్వ‌శ‌క్తితో, స‌మ‌ర్ధ‌త‌తో ఎన్నిక‌ల్లో పొరాడుతుంద‌ని అమిత్ షా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాని మోదీ
ప్ర‌చారానికి వ‌స్తారు. ప్ర‌ధాని రాకతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మారుతాయిని అమిత్ షా పేర్కొన్నారు. ద‌ళితుడు అనే అంశంతో కేసీఆర్‌ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌త్య‌ర్థులు ప‌న్నుతున్న వ్యూహంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ షా కామెంట్లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

అమిత్ షా ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌, అటుపై ప్ర‌త్య‌ర్థుల‌పై దుమారం రేపే వ్యాఖ్య‌ల‌తో అట్టుడికించారు. నేడు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు షా. ఆయనకు వీడ్కోలు పలకడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి త‌దిత‌రులు వెళ్ల‌డం మీడియా కంట ప‌డింది.

  •  
  •  
  •  
  •  

Comments