తెలంగాణ కోసం సిద్దమైన అమిత్ షా.. ఎన్నికల ప్రచారం ఆరంభం!

Saturday, September 15th, 2018, 03:51:01 AM IST


ఎలక్షన్స్ ఏ రాష్ట్రంలో జరిగినా కూడా భారత జనతా పార్టీ గెలవడానికి అసలు కారణం అమిత్ షా అనే చెప్పాలి. భారత జనతా పార్టీ దేశాన్ని పాలిస్తోంది అంటే మొదట అమిత్ షా ప్రణాళికలే అందుకు కారణమని చెప్పాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలు స్థానిక ప్రాంతాల్లో బలాన్ని తెలుసుకొని వ్యూహాలను రచించడం అమిత్ షాకు వెన్నతో పెట్టిన విద్య. అయితే గతంలో సక్సెస్ అయినట్టుగా ఈ మధ్య ఆయన ప్లాన్స్ వర్కౌట్ అవ్వడం లేదని మరో టాక్ వస్తోంది.

అయితే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలపరిచి తన సత్తా చాటుకోవాలని ఛాలెంజిగ్ గా తీసుకున్నారట. రేపు తెలంగాణాలో భారత జనతా పార్టీ మొదటి ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. అందుకు మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల వేదిక కానుంది. అమిత్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని 12 గంటలకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక 12 గంటలకు లాల్ దర్వాజా దగ్గర మహంకాళి అమ్మవారిని దర్శననంతరం మహబూబ్ నగర్ సభకు బయలుదేరనున్నారు. ఇక రాష్ట్ర నేతలతో సాయంత్రం సమావేశం జరిపి ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడానికి గల కొన్ని విషయాలను గురించి చర్చించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments