గాలి జనార్ధన్ రెడ్డికి అమిత్ షా ఝలక్

Friday, April 27th, 2018, 03:13:21 PM IST

కొద్దిరోజుల క్రితం గనుల కుంభకోణంలో పట్టుబడ్డ గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నట్టుండి ఓ ఝలక్ ఇచ్చారు. గాలి సోదరుల సొంత గడ్డ అయిన బళ్ళారి జిల్లాలో శుక్రవారం జరిగే ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కూడా అక్కడికి వెళ్లి పాల్గొనవలసి ఉంది, అయితే చివరి క్షణంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేయనున్నట్టు తేల్చి చెప్పారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని వివాదాస్పద చర్చల్లో కూరుకుపోయిన గాలి సోదరులతో వేదికాలో పాలు పంచుకోవలసిన అగత్యాన్ని తప్పించుకోవడానికే అమిత్ షా తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ విధంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అయితే రాబోవు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన ఏడుగురికి బీజేపీ టిక్కెట్లు లభించిన విషయం తెలిసిందే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప సభలో మాట్లాడుతూ తాను రెడ్డి సోదరులను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా క్షమించానని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ యడ్యూరప్పపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సోదరులు కర్ణాటక చరిత్రలో అతి పెద్ద నేరస్థులని ఆరోపించారు. అడ్డూ, అదుపూ లేకుండా వారు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. ఇదిలాగే ఉంటె వీళ్ళ ఆక్ర్యుత్యాలకు అడ్డు అదుపు ఉండదు అన్నారు. దీన్ని ఆపడానికి ఒక కచ్చితమైన నిర్ణయం తీస్కోవాలని ఆయన అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments