తెలంగాణలో బీజేపీ గెలవదని కన్ఫర్మ్ చేసిన అమిత్ షా !

Wednesday, October 10th, 2018, 04:41:37 PM IST

మొన్నా మధ్య తెలంగాణాలో జరిపిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈసారైనా ముఖ్యమంత్రి పదవి దళితుడికి ఇస్తారా కేసిఆర్ అంటూ ముందస్తు ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీనే అన్నట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే. బీజేపీ వేసుకున్న ఈ సెల్ఫ్ గోల్ ను ప్రజలు మరువకముందే అమిత్ షా మరొక గోల్ వేసుకున్నారు.

కరీంనగర్‌ సభ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఈసారి బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ లేదని గట్టిగా అన్నారు. దీన్నిబట్టి తాము గెలవమని బీజేపీ ముందుగానే నిర్ణయించేసుకుని ప్రభుత్వ ఏర్పాటులో అయినా పాలు పంచుకునే అవకాశం వస్తే తెలంగాణ మీద కొంత పట్టు సాదించవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇందులో ఇంకో అర్థం కూడా ఉంది. అదేమిటంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ మహాకూటమి, టిఆర్ఎస్ రెండింటినీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న బీజేపీ ఎన్నికల అంతరం ఎవరైన మద్దతు కోరితే అన్నీ వదిలేసి వాళ్ళ కౌగిట్లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది.