జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై మంత్రి సంచ‌ల‌నం

Thursday, March 7th, 2019, 10:50:44 AM IST

పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత మృతి వెనుక పెద్ద మిస్ట‌రీ వుంద‌ని గ‌త కొంత కాలంగా ప‌లు క‌థనాలు వెలువ‌డుతున్న విష‌యం తెలిసిందే. దీనికి అపోలో హాస్పిట‌ల్స్ హ‌స్తం కూడా వుంద‌ని, వారి స‌హ‌కారం వ‌ల్లే జ‌య‌ల‌లిత హ‌త్య‌ను సాధార‌ణ మృతిగా చిత్రీక‌రించార‌ని అన్నా డీఎంకే నేత‌లు చాలా సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. తాజాగా ప‌ళ‌ని స్వామి మంత్రి వ‌ర్గంలోని ఓ మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య‌ల‌లిత‌ను హ‌ల్వా ఇచ్చి చంపేశార‌ని తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణించి దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. అయినా ఆమె మ‌ర‌ణం వెన‌క వున్న మిస్టరీ ఇప్ప‌టికీ ఓ ర‌హ‌స్యంగానే మిగిలిపోయింది. ఆమె మ‌ర‌ణంపై న్యాయ‌శాఖ మంత్రి సీవీ ష‌ణ్ముగం చేసిన తాజా వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆమెకు హ‌వ్వాలో విషం పెట్టి చంపార‌ని ష‌ణ్మ‌గం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య‌ల‌లిత‌కు షుగ‌ర్ వ్యాధి వుంద‌ని తెలిసి కూడా శ‌శిక‌ళ హ‌ల్వా తినిపించిందిని, త‌ను అపోలో హాస్పిట‌ల్‌లో వున్న సంద‌ర్భంలో చూడాల‌ని ప్ర‌య‌త్నించినా శ‌శిక‌ల చూడ‌కుండా అడ్డుకున్నార‌ని, అమ్మ‌కు వ్యాధి ముదిరి స‌హజంగా మ‌రిణించాల‌న్న కుట్ర‌లో భాగంగానే ఆమెకు హ‌ల్వా తినిపించార‌ని చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. సాక్షాత్తు త‌మిళ‌నాగు న్యాయశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.