జయలలిత ఆరోగ్యం పై ప్రధాని ఆరా.. లోలోపల ఏం జరుగుతోంది..?

Saturday, September 24th, 2016, 01:21:13 PM IST

jayalalitha1
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సంచలనమైన పుకార్లు వినిపిస్తున్నాయి.గురువారం రోజు జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ తో భాదపడుతూ చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.మరుసటి రోజు జయ ఆరోగ్యం కుదుట పడిందంటూ ఆసుపర్తి వర్గాలు ప్రెస్ నోట్ ను విడుదల చేశాయి.దీనితో అన్న డీఎంకే పార్టీవర్గాలు, జయలలిత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నేడు జయ ఆరోగ్యం పై పుకార్లు వినిపిస్తునానయి.

ఆమెని తాజాగా మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మధుమేహం ఎక్కువస్థాయిలో ఉండడం,దీనికి తోడి కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండడంతో ఆమెని సింగపూర్ తరలించి జయకు మెరుగైన వైద్యం అందించాలనేది తమిళనాడు ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ జయలలిత ఆరోగ్యం పై ఆరా తీసినట్లు సమాచారం.ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని సందేశం పంపారు.అన్న డీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు జయ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.