భారత్ లో కాల్ సెంటర్ల కొంప కొల్లేరు అయింది..!

Wednesday, March 21st, 2018, 12:53:30 PM IST

ఎన్నేల్లనుంచో భారత్ లోని కొన్ని కంపనీలు, లక్షల మంది ఉద్యోగులు బతుకుతున్నది కేవలం కాల్ సెంటర్ల వల్లనేనని చెప్పుయ్కోనవసరం లేదు. అయితే భారతదేశంలో చాలామందికి బతుకుదేరువునిస్తున్న కాల్‌సెంటర్‌ ఉద్యోగాలపై అమెరికా కన్నెర్రజేసింది. తమ దేశంలోని కంపెనీలు ఆ ఉద్యోగాలను విదేశాలకు తరలిస్తున్నందున అమెరికన్లు నిరుద్యోగులుగా మారిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే పొరుగు సేవల (అవుట్‌ సోర్సింగ్‌) ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోకుండా నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లు ఒకటి అమెరికా సెనెట్‌ ముందుకు వచ్చింది. వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమెరికా చట్టసభల ఆమోదం పొందితే భారత్‌లో లక్షల మందికి ఉపాధికల్పిస్తున్న కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడతాయి.

ఓహియో రాష్ట్రానికి చెందిన డెమోక్రాట్‌ సెనెటర్‌ షెరాడ్‌ బ్రౌన్‌ ప్రతిపాదిత బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం..కాంట్రాక్టులను అప్పగించే సమయంలో విదేశాలకు ఉద్యోగాలను తరలించని కంపెనీలకే అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. కానీ అలా ఇవ్వకుండా ఇతర దేశాలకు అవుట్ సోర్సింగ్ చేయడం కొంతమేరకు గగ్గోలు పెట్టిస్తున్నాయి. అయితే దీని విషయమై కొన్ని ప్రతిపాదనలు వేల్లువడ్డాయి. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలను విదేశాలకు బదలాయిస్తున్న కంపెనీల జాబితాను రూపొందించి బహిరంగపరచాలి. వినియోగదారు (సర్వీస్‌ కస్టమర్‌)కు కాల్‌ సెంటర్‌ ఉద్యోగి తాను ఎక్కడి నుంచి పనిచేస్తున్నదీ ప్రకటించాలి, వీటన్నింటితో పాటు తన కాల్‌ను అమెరికాలోని సర్వీస్‌ ఏజెంట్‌కు బదిలీ చేయమని కోరే హక్కు కూడా వినియోగదారుకు లభిస్తుంది. వీటన్నింటిపైన అమెరికా ఒక నిర్ణయం తీస్కోవాలని డెమోక్రాట్‌ సెనెటర్‌ షెరాడ్‌ బ్రౌన్‌ వెల్లడించింది.

అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలి:
‘‘అమెరికాలో పన్ను ప్రోత్సాహకాలను పొందుతున్న అనేక రకాల కాల్ సెంటర్ల కంపెనీలు దేశంలోని తమ కాల్‌సెంటర్లను మూసివేసి వాటిని ఇతర దేశాలకు తరలించాయి. దీనివల్ల అమెరికన్లు ఉద్యోగాలు తీవ్రస్థాయిలో కోల్పోతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలకు మనం భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ’’అని బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో బ్రౌన్‌ విశ్లేషించారు. కమ్యూనికేషన్స్‌ వర్కర్స్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ అధ్యయనం ప్రకారం.. అమెరికా కంపెనీల కాల్‌ సెంటర్ల ఉద్యోగాలను పొందటంలో భారత్‌, ఫిలిప్పీన్స్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈజిప్టు, సౌదీ అరేబియా, చైనా, మెక్సికో లాంటి దేశాల్లోనూ అమెరికా కంపెనీలు కాల్‌ సెంటర్లను ప్రారంభించాయని ఆ నివేదిక వెల్లడించింది. కాల్‌ సెంటర్ల వ్యాపారంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, ఏడాదికి రూ.1,87,600 కోట్ల ఆదాయం దీని ద్వారా పొందుతోందని అమెరికాకు చెందిన నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ అంచనా వేసింది.