నిత్య యవ్వనాన్నిచ్చే ఎంజైమ్ ను కనుగొన్న సైంటిస్టులు!

Friday, April 27th, 2018, 04:38:35 PM IST

మనిషి పుట్టడం చిన్న వయసునుండి పెరిగి యవ్వనం లోకి రావడం ఆతరువాత వృద్ధాప్యంలోకి చేరడం అనేది మానవ జీవ పరిణామ క్రమం. అయితే మనం సినిమాల్లో చూసినట్లుగా మనిషికి యుక్తవయస్సు వచ్చాక ఎప్పటికీ అలా యువకుడిగా వుండే కొన్ని సన్నివేశాలు చూస్తుంటాం. అయితే అలాంటిది నిజంగా జరిగే అవకాశం ఉందని ప్రస్తుతం ఒక శాస్త్రవేత్త అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కృషి తర్వాత నిత్యా యవ్వనంగా వుండే ‘టెలోమెరాసె’ అనే ఒక ఎంజైమ్ ని 1970ల్లోనే అమెరికా, ఆస్ట్రేలియా పరిశోధకురాలు ఎలిజబెత్ బ్లాక్ బర్న్ కనుగొన్నారు.

అందుకు గాను ఆమెకు 2009లో నోబెల్ బహుమతికూడా లభించింది. నిజానికి ఈ పరిశోధనల విషయం ఎవరికి తెలియదు. ఆమె కనిపెట్టిన ఈ టెలోమెరాసే ఎంజైమ్ శరీరం రో ఎక్కువైతే కణ విభజన జరిగి కాన్సర్ వంటి ప్రమాదకర వ్యాదులు సంక్రమించే అవకాశం ఉందట. అయితే ఈ ఎంజైమ్ పై లోతుగా అధ్యయనం చేస్తున్న ప్రస్తుత శాస్త్రజ్ఞులు కాథలీన్ కొలిన్స్ మరియు ఆయన టీం కు కొన్ని రహస్యాలు తెలిశాయని అంటున్నారు. కొన్ని ఔషధాల ద్వారా కనుక ఈ ఎంజైమ్ ను అదుపులో, సమస్థితిలో వుంచగలిగితే ఎప్పటికీ నిత్యయవ్వనంగా వుండే అవకాశం ఉందని కొలీన్స్ అంటున్నారు.

అంతేకాక కాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు దరిచేరకుండా చేయవచ్చని తేలిందట. కాగా దీనికి సంబందించిన ఒక కథనాన్ని జర్నల్ నేచర్ ఇటీవల ప్రచురించింది. ఈ రకమైన ఎంజైమును అభివృద్ధి చేయగలిగితే ఇక నిత్యా యవ్వనం మనిషి సొంతమని శాస్త్రజ్ఞులు అంటున్నారు……