రజినీకాంత్ – చిరంజీవి రాజకీయాలకి పనికిరారా..?

Wednesday, September 28th, 2016, 03:50:11 AM IST

rajni-chiru
ఆయన పేరు చెప్తే కొన్ని కోట్ల గుండెలు సంతోషంతో కొట్టుకుంటాయి, ఆయన సినిమా టికెట్టు అంటే చొక్కాలు చిరుగుతాయి – బాక్స్ ఆఫీస్ లు పగులుతాయి. ఆయన రేంజ్ కి తమిళనాడు ,తెలుగు నాడు లలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ అదిరిపోతుంది .. అతనెవరో కాదు రజినీకాంత్. రజినీకాంత్ సినిమాలలో కింగ్ , మకుటం లేని మహారాజు . కానీ రాజకీయాలవైపు కన్నెత్తి కూడా చూడని యోధుడు.అప్పట్లో ఆయన రాజకీయాలలోకి ఇదిగో ఒస్తున్నా అదిగో ఒస్తున్నా అంటున్న తరుణం లో చిరంజీవి రంగంలోకి దిగిపోయి మరీ ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించేసారు. రజిని ని నమ్ముకునే నేను రాజకీయాలలోకి వచ్చాను తీరా చూస్తే ఆయన సైలెంట్ అయిపోయాడు నేను మునిగిపోయాను అని చిరు ఇదివరకు చాలా సార్లు అన్నారు కూడా. అప్పటి నుంచీ ఎన్నో సార్లు రజిని రాజకీయాలలోకి ఒస్తారు అని అందరూ ఎదురు చూసారు కానీ ఆయన రాలేదు. తాజాగా రజిని సోదరుడు సత్యనరాయణ రజిని ఇకమీదట రాజకీయాలలోకి రారుగాక రారు అంటూ తేల్చి పడేసారు. మీడియా కి ఇది ఇప్పుడో పెద్ద న్యూస్ అయిపొయింది. ఆయన రాజకీయ అరంగేట్రం ఇహనో ఇప్పుడో ఉంటుంది అనుకున్నవారు అంతా ఇప్పుడు షాక్ కి గురయ్యారు. రాజకీయాలలోకి వచ్చి ఎదో మార్పు తీసుకొస్తారు అనుకున్న ఫాన్స్ కి మౌనమే సమాధానం అయ్యింది. రీల్ హీరో నుంచి రియల్ హీరో అవ్వడం కేవలం ఎన్టీఆర్ కే దక్కింది అయిన్ చెప్పాలి. చిరంజీవి సమకాలీకుడు అయిన రజిని చిరు ని చూసిన తరవాత కాస్త అలోచించి అప్పట్లోనే వెనకడుగు వేసాడు. చిరు అనుభవం నుంచి రజిని సరైన రీతిలో నిజాలు తెలుసుకున్నాడు. అయినా చిరు , రజినీకాంత్ లాంటి వాళ్ళు రాజకీయాలలో మార్పులు తీసుకుని ఒస్తారు అనుకోవడం ప్రాక్టికల్ గా జరగదు అనే చెప్పాలి. అసలు వారికి జీవితాలని ఇచ్చిన సినిమా పరిశ్రమ ని వారు ఎంతగా మార్చగలిగారు ? ప్రభావితం చేసే ఫాన్స్ ని , హీరోలని పట్టుకొచ్చారు తప్ప ఇండస్ట్రీ పడుతున్న కష్టాలు ఏనాడు అయినా చూసారా వారు ? ఆ విషయం పక్కన పెట్టినా ఇప్పుడు కావేరి జలాల సమస్య రాగానే కమల్ హాసన్ చాలా ధైర్యంగా స్పందించాడు. రజినీకి ఆ గట్స్ ఉన్నాయా? తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అభిప్రాయం ఏంటో చిరంజీవి స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం చేశాడా? ఆవేశపరుడు, ఆలోచనాపరుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడా? విభజన పూర్తయ్యాక తీరిగ్గా ప్రజల ముందుకు వచ్చి విభజన సమయంలో తాను ఏమేం మాట్లాడాలనుకున్నాడో అవన్నీ చెప్పేశాడు. ధైర్యం , తెగువ లేని రజినీకాంత్ – చిరంజీవి లాంటి వారు రాజకీయాలకి పనికిరారు అంటున్నారు విశ్లేషకులు.

  •  
  •  
  •  
  •  

Comments