వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆనం!

Sunday, September 2nd, 2018, 05:45:08 PM IST

ఇటీవల టిడిపిలో చేరిన మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి నేడు ఆ పార్టీని వీడి, వైసిపిలో చేరారు, కొన్నాళ్లక్రితం అయన సోదరుడు వివేకానంద రెడ్డి మృతితో ఒకింత ఢీలాపడ్డ రామనారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. కానీ అయన తన సోదరుడి మృతికంటె కొద్దిరోజుల ముందునుండే టిడిపిపై కొంత అసంతృప్తితో వున్నారని, అయితే అనుకోకుండా సోదరుడు మృతి చెందడంతో తీవ్ర కలత చెందిన అయన, ఇటీవల తన అనుచరులతో సమావేశం తరువాత చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ను నేడు ఆనం విశాఖ జిల్లా వెచలంలో కలుసుకుని తాను పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆపై జగన్ ఆయనను పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతో పాటు అయన అనుచరులు, మరికొందరు మద్దతుదారులు కూడా చేరడంతో అక్కడ కొంత పండుగ వాతావరణం నెలకొంది.

ఆనం రామనారాయణ రెడ్డి చేరికపై వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆనం మాట్లాడుతూ, ఏపీ ప్రజలను టీడీపీ, బీజేపీలు పూర్తిగా మోసం చేశాయని, ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయంలో ఆ పార్టీలు చేసిన కుట్రల వల్ల ఏపీ ప్రజలు పూర్తిగా సమయాల్లో కూరుకుపోయారని అన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని, తండ్రి వైఎస్ లాగా జగన్ కూడా మంచి విజన్ వున్న నాయకుడని, తండ్రిలా అయన కూడా త్వరలోనే సీఎం పీఠాన్ని చేపట్టి తీరుతారని అయన ఆశాభావం వ్యక్తం చేసారు. పార్టీకి రాబోయే రోజుల్లో తనవంతు కృషి చేసి గెలుపునకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments