ఆ పార్టీలో చేరనున్న ఆనం రాంనారాయణ రెడ్డి!

Sunday, April 29th, 2018, 08:35:42 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు ఆయనకు మంచి వెన్నుదన్నుగా నిలిచినా వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు కూడా ముందు వరసలో వుంటారు. అయితే ఇటీవల ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి అనారోగ్య కారణాల వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంతో అన్న రామ్ నారాయణ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తరువాత అనుచరులతో కలిసి మాట్లాడిన ఆనం తన భవిష్యత్తు పై ఒక నిర్ణయాన్ని వచ్చారట. ప్రస్తుతం ఆయన టిడిపి ని వీడి వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆనం సోదరులు ఆ పార్టీ ని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

అయితే వివేకా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు పార్టీలో తన స్థానం, అలానే భవిష్యత్తుపై సరైన సమాధానం ఇవ్వనందున అనుచరులతో కలిసి చర్చించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. నిజానికి ఈ నిర్ణయం వివేకా బ్రతికి వున్నపుడే తీసుకున్నదని, సోదరులు ఇద్దరుకూడా వైసిపిలో చేరదాం అనుకున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు వివేకా మరణంతో ప్రస్తుతం రాంనారాయణ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు. కాగా ఈ విషయమై కొద్దిరోజుల్లో ఆనం నుండి ప్రకటన రానుందని తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments